తెలంగాణ గృహ లక్ష్మీ పథకం

author
Submitted by shahrukh on Thu, 02/05/2024 - 13:14
తెలంగాణ CM
Scheme Open
Highlights
  • తెలంగాణ గృహ లక్ష్మీ పథకం కింద ఇంటి నిర్మాణం కోసం కింద ఇవ్వబడిన ఆర్థిక సహకారాన్ని అందజేయబడును :-
    • ఇంటి నిర్మాణం కోసం Rs. 3,00,000/- ఆర్థిక సహకారాన్ని ఇవ్వబడును.
    • కింద ఇవ్వబడిన మూడు దశలలో ఆర్థిక సహకారం అందజేయబడును :-
      • బేస్ మెంట్ లెవెల్ దశ :- Rs. 1,00,000/-.
      • ఇంటి కప్పు నిర్మాణ దశ :- Rs. 1,00,000/-.
      • ఇంటి నిర్మాణ పూర్తిదశ :- Rs. 1,00,000/-.
Customer Care
  • తెలంగాణ గృహ లక్ష్మీ పథకం హెల్ప్ లైన్ నెంబర్ :- 040-29390057.
  • తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ సంస్థ హెల్ప్ లైన్ నెంబర్ :- 040 23225018.
  • తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ సంస్థ హెల్ప్ డెస్క్ ఈమెయిల్ :- helpdesk.tshcl@cgg.gov.in.
పథకం వివరాలు
పథకం పేరు తెలంగాణ గృహ లక్ష్మీ పథకం.
ప్రారంభించిన సంవత్సరం 2023.
లాభాలు గృహ నిర్మాణానికి Rs. 3,00,000/- ఆర్థిక సహకారం.
లబ్ధిదారులు తెలంగాణ మహిళలు.
అమలు చేసే సంస్థ తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ సంస్థ.
నోడల్ విభాగం రవాణా, రోడ్డు మరియు నిర్మాణ విభాగం, తెలంగాణ ప్రభుత్వం.
సబ్స్క్రిప్షన్ తెలంగాణ గృహ లక్ష్మీ పథక వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి.
అధికారిక పోర్టల్ తెలంగాణ గృహ లక్ష్మీ పథక అధికారిక వెబ్ సైట్.
అప్లై చేసే విధానం తెలంగాణ గృహ లక్ష్మి పథక అప్లికేషన్ ఫామ్.

పరిచయం

  • తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రారంభించింది.
  • అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారు.
  • తెలంగాణలో చాలామంది తమ సొంత భూమి ఉన్నా కూడా, ఆర్థిక పరిస్థితుల వల్ల, ఇల్లు నిర్మించుకోలేకపోతున్నారు.
  • సొంత భూమి ఉన్న వారి కోసం, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమైన గృహ పథకాన్ని ప్రారంభించింది.
  • తెలంగాణ ప్రభుత్వం యొక్క కొత్త గృహ పథకమే “తెలంగాణ గృహ లక్ష్మీ పథకం.”
  • అర్హులైన తెలంగాణ ప్రజలకి, ఇల్లు నిర్మించుకోవడానికి, ఆర్థిక సహాయాన్ని అందించడమే తెలంగాణ గృహ లక్ష్మీ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
  • తెలంగాణ గృహలక్ష్మి పథకాన్ని “తెలంగాణ బలహీన వర్గాల గృహ కార్యక్రమం” లేదా “తెలంగాణ ఇంటి నిర్మాణ ఆర్థిక సహాయ పథకం” అని కూడా అంటారు.
  • తెలంగాణ గృహ లక్ష్మీ పథకం కింద, ఇంటి నిర్మాణం కోసం, తెలంగాణ ప్రభుత్వం Rs. 3,00,000/- ఆర్థిక సహకారాన్ని అందజేస్తుంది.
  • తెలంగాణ గృహ లక్ష్మీ పథకం కింద ఇవ్వబడిన మూడు వాయిదాల ప్రకారం ఆర్థిక సహకారాన్ని అందజేస్తుంది :-
    • బేస్ మెంట్ లెవెల్ దశ లో Rs. 1,00,000/- ఇవ్వబడును.
    • ఇంటి కప్పు నిర్మాణ దశలో Rs. 1,00,000/- ఇవ్వబడును.
    • ఇంటి నిర్మాణం పూర్తి చేసే దశలో Rs. 1,00,000/- ఇవ్వబడును.
  • సొంత భూమి ఉన్నవారు మాత్రమే తెలంగాణ గృహ లక్ష్మీ పథక ఆర్థిక సహకారానికి అర్హులు.
  • తెలంగాణ గృహ లక్ష్మీ పథకం EWS (ఆర్థిక బలహీన వర్గం) విభాగానికి చెందిన వారికి మాత్రమే.
  • తెలంగాణ ప్రభుత్వ గృహ లక్ష్మీ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని పొందాలంటే ఆహార భద్రతా పత్రాన్ని కలిగి ఉండడం తప్పనిసరి.
  • తెలంగాణ ప్రభుత్వం ఇంటి నిర్మాణ ఖర్చులకు మాత్రమే ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది.
  • తెలంగాణ గృహలక్ష్మి పథకం ద్వారా మంజూరైన ఇల్లులన్నీ మహిళలు లేదా వితంతువుల పేరు మీద నమోదు చేయబడును.
  • ఈ పథకం కింద RCC ఫ్రేమ్ స్ట్రక్చర్ కలిగి ఉన్న 2 గదులు, టాయిలెట్ నిర్మించబడును.
  • ఇంటి ప్రణాళికను లబ్ధిదారులు తయారు చేసుకోవచ్చు.
  • తెలంగాణ గృహలక్ష్మి పథకం కింద Rs. 3,00,000/- ఆర్థిక సహాయం, రాష్ట్రంలో 4,00,000 ఇంటి నిర్మాణ పనులకు ఇవ్వబడుతుందని అంచనా వేయబడింది.
  • బ్యాంకు ఖాతా మహిళా లబ్ధిదారుల పేరు మీద ఉండాలి.
  • జన్ ధన్ ఖాతాలు తెలంగాణ గృహలక్ష్మి పథకానికి పరిగణించబడవు.
  • తెలంగాణ గృహలక్ష్మి పథకానికి ఆన్ లైన్ అప్లికేషన్ ఫామ్ గాని ఆన్ లైన్ అప్లికేషన్ పద్ధతి గాని లేవు.
  • తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ గృహ లక్ష్మీ పథకానికి చివరి తేదీని ఎక్కడ ప్రస్తావించలేదు.
  • అర్హులైన మహిళా లబ్ధిదారులు, తెలంగాణ గృహ లక్ష్మీ పథకం కింద ఇంటి నిర్మాణ ఆర్థిక సహకారానికి అప్లై చేసుకోవచ్చు.

పథకం యొక్క లాభాలు

  • తెలంగాణ గృహ లక్ష్మీ పథకం కింద ఇంటి నిర్మాణం కోసం కింద ఇవ్వబడిన ఆర్థిక సహకారాన్ని అందజేయబడును :-
    • ఇంటి నిర్మాణం కోసం Rs. 3,00,000/- ఆర్థిక సహకారాన్ని ఇవ్వబడును.
    • కింద ఇవ్వబడిన మూడు దశలలో ఆర్థిక సహకారం అందజేయబడును :-
      • బేస్ మెంట్ లెవెల్ దశ :- Rs. 1,00,000/-.
      • ఇంటి కప్పు నిర్మాణ దశ :- Rs. 1,00,000/-.
      • ఇంటి నిర్మాణ పూర్తిదశ :- Rs. 1,00,000/-.

Telangana Gruha Lakshmi Scheme Benefits

అర్హత

  • తెలంగాణ ప్రభుత్వ గృహ లక్ష్మీ పథకానికి అర్హత వివరాలు :-
    • లబ్ధిదారులు శాశ్వత తెలంగాణ నివాసులై ఉండాలి.
    • లబ్ధిదారులు EWS విభాగానికి చెందిన వారై ఉండాలి.
    • లబ్ధిదారులు ఆహార భద్రతా పత్రాన్ని కలిగి ఉండాలి.
    • లబ్ధిదారులు వివాహమైన మహిళ లేదా వితంతువై ఉండాలి.
    • లబ్ధిదారులు సొంత భూమిని కలిగి ఉండాలి.
    • లబ్ధిదారులు గ్రామంలో లేదా అర్బన్ లోకల్ బాడీలో (UBL) నివసిస్తూ ఉండాలి.

అవసరమైన పత్రాలు

  • తెలంగాణ గృహలక్ష్మి పథకం కింద, భవన నిర్మాణానికి ఆర్థిక సహకారాన్ని పొందాలంటే, కింద ఇవ్వబడిన పత్రాలు కలిగి ఉండాలి :-
    • తెలంగాణ నివాస ధ్రువీకరణ పత్రం.
    • బ్యాంకు ఖాతా వివరములు.
    • పాస్ పోర్ట్ సైజ్ ఫోటో.
    • లబ్ధిదారుల ఆధార్ కార్డు.
    • ఆహార భద్రత కార్డ్.
    • రేషన్ కార్డ్.
    • సర్టిఫికెట్.
    • మొబైల్ నెంబర్.

అప్లై చేయు విధానం

  • తెలంగాణ గృహలక్ష్మి పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహకారాన్ని పొందడానికి అర్హులైన వారందరూ అప్లై చేయవచ్చు.
  • తెలంగాణ గృహలక్ష్మి పథకం అప్లికేషన్ ఫామ్ ను కింద ఇవ్వబడిన ఆఫీసులలో ఫ్రీగా పొందవచ్చును : -
    • మున్సిపల్ కార్పొరేషన్.
    • గ్రామసభ.
    • గ్రామపంచాయతీ.
    • మండల ఆఫీస్.
  • తెలంగాణ ప్రభుత్వ గృహ లక్ష్మీ పథకం అప్లికేషన్ ఫామ్ ను సేకరించి జాగ్రత్తగా నింపండి.
  • అవసరమైన పత్రాలన్నింటినీ అప్లికేషన్ ఫామ్ కు జత చేయండి.
  • తెలంగాణ గృహ లక్ష్మీ పథకానికి అప్లై చేయు సమయంలో ఆధార్ కార్డును కలిగి ఉండడం తప్పనిసరి.
  • అప్లికేషన్ ఫామ్ ను సేకరించిన ఆఫీసులోనే తెలంగాణ గృహ లక్ష్మీ పథకం అప్లికేషన్ ఫామ్ మరియు అవసరమైన పత్రాలు అన్నింటిని సమర్పించండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు పత్రాలు అధికారుల చేత నిషితంగా పరిశీలించబడును.
  • అప్లికేషన్ ఫామ్ ను ధ్రువీకరించిన తరువాత, తెలంగాణ గృహలక్ష్మి పథకం కింద ఆర్థిక సహకారాన్ని, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు మూడు దశలలో పంపించబడును.

ముఖ్యమైన లింక్స్

సంప్రదింపు వివరాలు

  • తెలంగాణ గృహ లక్ష్మీ పథకం హెల్ప్ లైన్ నెంబర్ :- 040-29390057.
  • తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ సంస్థ హెల్ప్ లైన్ నెంబర్ :- 040 23225018.
  • తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ సంస్థ హెల్ప్ డెస్క్ ఈమెయిల్ :- helpdesk.tshcl@cgg.gov.in.

Comments

వ్యాఖ్య

If we ask about application form in mentioned offices, they're saying till , didn't receive any information about this so where we can collect the application form to applying GruhaLaxmi scheme.

స్థిరలంకె

వ్యాఖ్య

నా పేరు నిమ్మల నిర్మల w/o: రమేష్. అశోక్ నగర్, ఖానాపూర్, వరంగల్. తెలంగాణ. 506132
నా భర్త రమేష్ వికలాంగుడు మాకు కనీసం ఉండటానికి ఇల్లు లేదు. గృహలక్ష్మి పథకం ఆన్లైన్ లో పెడతాము అన్నారు. ఇంత వరకు లేదు కెసిఆర్ గారి ఏ పథకం ప్రవేశ పెట్టిన ఆ పథకం నిరుపేద వర్గాలకు చెందే విధంగా ఉంటది. గృహలక్ష్మి పథకం ఎప్పుడు ఆన్లైన్ పెడతారు. లేదా అప్లికేషన్ ఫోరం ఎక్కడ ఇవ్వవొచు.

వ్యాఖ్య

నేను వడ్డేపల్లి 60 డివిజన్ హనుమకొండ వాసిని, నేను ఎక్కడ apply చేయాలి, మీ సేవ లో వుందా

వ్యాఖ్య

మ అమ్మ నాన్న చనిపొయరు.
మ ఇంట్లో ఆడవాళ్ళు లేరు.
మేము గ్రౄహలక్ష్మీ పథకం ఎలా ఆర్జీ పెటుకోవలీ.
సలహాలు ఇవ్వగలరు.
Sambagogu@gmail.com.

వ్యాఖ్య

అయ్యా కేసీఆర్ గారు ఇప్పుడు వరకు అఫీషియల్ వెబ్సైట్ ఏది గృహలక్ష్మి పథకానికి ఇప్పుడు దాకా మీరు ఇవ్వలేదు ..

వ్యాఖ్య

Naaku amma ledhu sir....maa intlo 3 members mi untamu...maaku illu jaga chala chinnaga undhi...kavuna maaku ee scheme dvara sahayam cheyagalani manavi......memu arthikanga chala poor...sir please maaku ee scheme nundi funds vachela cheyyandi sir...🙏🙏🙏

వ్యాఖ్య

Namskaram sir...🙏
Peddapalli d.s ,
Narsaiah house katukunna ani vaste. Kattukonivedu. Atani land kosam 10yrs nunchi chala pareshan aitunnadu. Narsaiah daggara bhumi documents unnai.. tanu online cheskoleka poyadu.
Sir mee help toh aina Narsaiah ki land ipinchandi. Tanu house kattukovadaniki help cheyandi🙏🙏
Telangana lo Narsaiah ki house ivvali ani korkutunna sir🙏🙏🙏🙏🙏🙏

స్థిరలంకె

వ్యాఖ్య

సార్ recntly మా అమ్మ చనిపోయారు మేము గృహ లక్ష్మి కి apply చేసుకోరాదా and ల్యాండ్ కూడా మా అమ్మ పేరుమీదే ఉంది మరి మాకు ఎలా సార్

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.