తెలంగాణ దళిత బంధు పథకం

author
Submitted by shahrukh on Thu, 02/05/2024 - 13:14
తెలంగాణ CM
Scheme Open
Highlights
  • తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ దళిత బంధు పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు కింద ఇవ్వబడిన లాభాలను అందజేస్తుంది :-
    • ఒకసారి Rs.10,00,000/- ల ఆర్థిక సహాయం ఇవ్వబడును.
    • ఈ ఆర్థిక సహకారం స్వయం ఉపాధిని కల్పించి, ఆదాయాన్ని ఉత్పత్తి చేసే బిజినెస్ లేదా ఇతర పనుల కొరకు ఇవ్వబడుతుంది.
    • ఇది లోను కాదు కాబట్టి ఈ సహకారాన్ని పొందడానికి ఎటువంటి గ్యారెంటీ అవసరం లేదు.
    • లబ్ధిదారులు ప్రభుత్వానికి ఈ డబ్బును తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.
Customer Care
  • తెలంగాణ దళిత బంధు పథకం హెల్ప్ లైన్ నంబర్స్ :-
    • 09000289154.
    • 09000219154.
  • తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ సహకార అభివృద్ధి సంస్థ హెల్ప్ లైన్ నంబర్స్ :-
    • 18005992525.
    • 040-23315970.
  • తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ సహకార అభివృద్ధి సంస్థ హెల్ప్ డెస్క్ ఈమెయిల్ :-
    • md_tgsccfc@telangana.gov.in.
    • mdtgsccfc@gmail.com.
పథకం వివరాలు
పథకం పేరు తెలంగాణ దళిత బంధు పథకం.
ప్రారంభించిన తేదీ 04 ఆగస్టు 2021.
లబ్ధిదారులు షెడ్యూల్ క్యాస్ట్ (SC) కుటుంబాలు.
లాభాలు
  • కుటుంబానికి Rs.10,00,000/- ల ఆర్థిక సహకారం.
  • బ్యాంకు అనుసంధానం లేకుండా ప్రత్యక్ష ఆర్థిక సహకార ట్రాన్స్ఫర్.
  • సహకారాన్ని తిరిగి చెల్లించనవసరం లేదు (100% సబ్సిడీ)
వెబ్సైట్ తెలంగాణ దళిత బంధు పథకం పోర్టల్.
నోడల్ ఏజెన్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ అభివృద్ధి విభాగం.
సబ్ స్క్రిప్షన్ పథకం యొక్క వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.
అమలు చేసే ఏజెన్సీ తెలంగాణ షెడ్యూల్డ్ క్యాస్ట్ సహకార అభివృద్ధి సంస్థ.

పరిచయం

  • తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రజల ఉన్నతి కొరకు, 16 ఆగస్టు 2021న హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం లో ప్రారంభించింది.
  • ఈ ఆర్థిక సహకార పథకం, రాష్ట్రంలోని నిరుపేద ప్రజల సాధికారతపై దృష్టి పెడుతుంది.
  • ఈ పథకం కింద, ప్రతి షెడ్యూల్డ్ క్యాస్ట్ కుటుంబంలోని ఒక వ్యక్తికి Rs.10,00,000/- మూలధన సహాయం అందజేయబడుతుంది. దీని ద్వారా, వారికి శక్తికి తగినంత మేరకు ఆదాయాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు.
  • ఈ ఆర్థిక సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిబిటి ( డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా ప్రత్యక్షంగా, బ్యాంకు లోను అవసరం లేకుండా, 100% సబ్సిడీతో ట్రాన్స్ఫర్ చేస్తుంది.
  • దళిత బంధు పథకం, నిరుపేద ప్రజలకు స్వయం ఉపాధిని కల్పించడం ద్వారా గౌరవంతో మరియు స్వయం సమృద్ధితో బతకడానికి సహాయం చేస్తుంది.
  • దళిత బంధు పథకం లబ్ధిదారుల కు స్వయం ఉపాధిని కల్పించడమే కాకుండా, వారిని ఇతర ప్రజలకు ఉపాధిని కల్పించడానికి తోడ్పడుతుంది.
  • ఈ పథకం, తెలంగాణ రాష్ట్రంలోని, 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో నివసించే, ప్రతి ఒక్క షెడ్యూల్డ్ క్యాస్ట్ (SC) కుటుంబానికి 3 నుంచి 4 సంవత్సరాలలో అమలుపరచబడుతుంది.
  • తెలంగాణ ప్రభుత్వం, దళిత బంధు పథకం కింద ప్రతి సంవత్సరం 30,000 నుండి 40,000 కోట్ల వరకు వెచ్చిస్తుంది.
  • ప్రస్తుతానికి హుజరాబాద్ ను మినహాయించి, ఇతర నియోజకవర్గాలలో 100 షెడ్యూల్డ్ క్యాస్ట్ కుటుంబాల కు దళిత బంధు పథకం లాభాలను అందజేయడానికి ఎంపిక చేశారు.
  • అంతేకాకుండా, ఆపద సమయాలలో లబ్ధిదారులకు ఆర్థిక సహకారాన్ని అందించడానికి ప్రొటెక్షన్ ఫండ్ లేదా సెక్యూరిటీ ఫండ్ను కూడా ప్రారంభించారు.
  • షెడ్యూల్డ్ క్యాస్ట్ కుటుంబాలుగా గుర్తించబడిన ప్రతివారు ఈ పథకానికి అర్హులు. లబ్ధిదారులకు దళిత బంధు కార్డు లేదా ఎలక్ట్రానిక్ కార్డ్ ను తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షణకు ఇవ్వబడుతుంది.
  • అర్హులైన లబ్ధిదారులు పరిశ్రమ, సేవ, రిటైల్, రవాణా, మరియు ఇతర బిజినెస్ రంగాలలో స్వయం ఉపాధిని కల్పించుకోవచ్చు.

Telangana Dalit Bandhu Scheme Eligible Income Generation Activity

పథకం లాభాలు

  • తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ దళిత బంధు పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు కింద ఇవ్వబడిన లాభాలను అందజేస్తుంది :-
    • ఒకసారి Rs.10,00,000/- ల ఆర్థిక సహాయం ఇవ్వబడును.
    • ఈ ఆర్థిక సహకారం స్వయం ఉపాధిని కల్పించి, ఆదాయాన్ని ఉత్పత్తి చేసే బిజినెస్ లేదా ఇతర పనుల కొరకు ఇవ్వబడుతుంది.
    • ఇది లోను కాదు కాబట్టి ఈ సహకారాన్ని పొందడానికి ఎటువంటి గ్యారెంటీ అవసరం లేదు.
    • లబ్ధిదారులు ప్రభుత్వానికి ఈ డబ్బును తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.

Telangana Dalit Bandhu Card.

పథకం అర్హత

  • లబ్ధిదారులు తెలంగాణ శాశ్వత నివాసులై ఉండాలి.
  • లబ్ధిదారులు షెడ్యూల్డ్ క్యాస్ట్ (SC) వర్గానికి చెందిన వారై ఉండాలి.

పథకానికి అవసరమైన పత్రాలు

  • తెలంగాణ దళిత బంధు పథకం లాభాలను పొందడానికి కింద ఇవ్వబడిన పత్రాలు అవసరమవుతాయి :-
    • నివాస ధ్రువీకరణ పత్రం.
    • SC క్యాస్ట్ సర్టిఫికెట్.
    • ఆధార్ కార్డు.
    • రైస్ కార్డ్/ ఫుడ్ కార్డ్.
    • మొబైల్ నెంబర్.
    • డ్రైవింగ్ లైసెన్స్ ( రవాణా వర్గం కోసం).
    • క్వాలిఫికేషన్ మరియు స్కిల్ సర్టిఫికెట్ (సంబంధిత వర్గాల కోసం).

పథకానికి అప్లై చేసే విధానం

  • ఎస్ ఈ ఆర్ పి (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టి), ఎం ఈ పి ఎంఏ (మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టి ఇన్ మున్సిపల్ ఏరియాస్), మరియు గ్రామసభ/ మున్సిపల్ సభ లబ్ధిదారుల ప్రాధాన్యత కొరకు సేకరించిన సమాచారం ద్వారా, జిల్లా పర్యవేక్షణ కమిటీ మరియు జిల్లా కలెక్టర్ లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

పథకం లక్షణాలు

  • తెలంగాణ దళిత బంధు పథకం అమలుపరచడానికి, అన్ని కమర్షియల్ బ్యాంకులలో విడి గా తెలంగాణ దళిత బంధు ఖాతా సౌకర్యం అందజేయబడుతుంది.
  • లబ్ధిదారుల దళిత బంధు ఖాతా ఈ బ్యాంకులలో తెరవచ్చు. ఈ బ్యాంకుకు ఎటువంటి డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు ఉండవు. దళిత బంధు కార్డు ద్వారా NEFT/RTGS పద్ధతుల ద్వారా సప్లయర్స్ కు ఈ అకౌంట్ నుండి డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
  • Rs. 9.90 లక్షలు ప్రత్యక్షంగా దళిత బంధు ఖాతాకు మరియు Rs.10,000/- ఆధార్ కార్డు ద్వారా దళిత రక్షణ నిధికి ట్రాన్స్ఫర్ చేయబడును. Rs.10,000/- దళిత రక్షణ నిధి కి ట్రాన్స్ఫర్ చేయబడును.
  • పథకం కొటేషన్ మంజూరు చేయబడిన తర్వాత, ఆర్థిక సహకార నగదు లబ్ధిదారుల అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయబడును.
  • లబ్ధిదారులు వారు ఎంపిక చేసుకున్న స్వయం ఉపాధి పనులకు Rs.9.90 లక్షలు ఉపయోగించుకోవచ్చు.
  • లబ్ధిదారులు ఈ డబ్బును తిరిగి చెల్లించనవసరం లేదు.

ఈ పథకానికి వర్తించే సెక్టార్స్ మరియు కాంపోనెంట్స్

  • తెలంగాణ దళిత బంధు పథకం కింద ఒకసారి ఆర్థిక సహకారాన్ని పొందడానికి కింద ఇవ్వబడిన సెక్టార్స్ లేదా ఆదాయ ఉత్పత్తి పనులకు అర్హత ఉంది:-
    సెక్టార్ కాంపోనెంట్
    వ్యవసాయ సంబంధిత
    • ఆగ్రో మెకానిస్ట్ ఫామ్ ఎక్విప్మెంట్ షాప్.
    • వ్యవసాయ మరియు ఇతర కంప్లైంట్స్.
    • కూరగాయల పందిల్లు.
    • కూరగాయ పందిళ్ళ సాగు.
    • రోటవేటర్.
    • బోర్వెల్.
    • భూమి అభివృద్ధి.
    • వరి నాటు మిషన్లు.
    • పట్టు పరిశ్రమ.
    • దూది వత్తుల తయారీ పథకం.
    పశు సంరక్షణ
    • డైరీ.
    • పౌల్ట్రీ ఫార్మ్.
    • పౌల్ట్రీ ఫార్మ్ ( బ్రాయిలర్ / నాటు).
    • పశువుల/ పౌల్ట్రీ మేత మ్యానుఫ్యాక్చరింగ్.
    • షెడ్డు నిర్మాణం.
    • చేపల చెరువు.
    • మేకల పెంపకం.
    • పాలుప్రాసెసింగ్ సెంటర్.
    • గొర్రెల మంద.
    • పశుగ్రాసం & మేత, ఇతర అవసరాలు.
    • పశువుల షెడ్డు.
    మ్యానుఫ్యాక్చరింగ్
    • వాటర్ బాటిల్ తయారీ మరియు స్మార్ట్ వాటర్ యూనిట్.
    • సిరామిక్ పరిశ్రమ.
    • సెంట్రింగ్/ RCC పైకప్పు తయారీ యూనిట్ (స్టీలు & చెక్క).
    • వేప నూనె & గానుగ.
    రిటైల్
    • అక్రిలిక్ షీట్స్ & టైల్స్ బిజినెస్.
    • బిల్డింగ్ మెటీరియల్ స్టోర్.
    • సిమెంటు/ స్టీలు (సబ్ డీలర్షిప్) షాపు.
    • సిమెంట్ ఇటుక & రింగుల తయారీ & ప్రీ కాస్టింగ్ వాల్స్.
    • చెప్పుల షాపు.
    • బట్టల ఎంపోరియం/ టెక్స్టైల్ మరియు రెడీమేడ్ గార్మెంట్స్ షోరూమ్.
    • డయాగ్నొస్టిక్స్ లాబ్.
    • డిస్పోజబుల్ వస్తువుల స్టోర్
      (పేపర్ ప్లేట్లు, వాటర్ గ్లాసులు, పేపర్ నాప్కిన్స్, టిష్యూ పేపర్ Etc.)
    • ఫుట్వేర్ షాప్.
    • బేసిక్ ఫర్నిచర్ షాప్.
    • టైర్ల షాప్.
    • స్పోర్ట్స్ ఎంపోరియం.
    • గ్రానైట్ బిజినెస్.
    • సూపర్ మార్కెట్.
    • కూరగాయల షాప్.
    • షాపులకు రెంటు/ రెంటల్ అడ్వాన్స్.
    • హార్డ్వేర్ & సానిటరీ మార్ట్.
    • పేపర్ ప్లేట్లు/ గ్లాసులు/ బ్యాగుల తయారీ యూనిట్.
    • రిటైల్ డీలర్ షిప్.
    • సానిటరీ షాపు, స్టీలు మరియు సిమెంట్ షాప్.
    • విత్తనాలు, పెస్టిసైడ్స్& ఫర్టిలైజర్ షాప్.
    • హార్డ్వేర్ షాప్.
    • స్టేషనరీ& బుక్ స్టోర్.
    • ఫర్నిచర్ తయారీ యూనిట్/ షాపు.
    • అల్యూమినియం ఫ్రేమ్ తయారీ యూనిట్.
    • మినీ సూపర్ బజార్.
    • లెదర్ గూడ్స్, ఫుట్వేర్ షాప్.
    • పెయింటింగ్ షాప్.
    • లేడీస్ ఎంపోరియం, ఎంబ్రాయిడరీ మరియు టైలరింగ్.
    • మెడికల్ మరియు జనరల్ స్టోర్స్.
    • మెడికల్ షాప్.
    • బేకరీ/ స్వీట్ షాపులు/ కూల్ డ్రింక్ షాపులు/ జ్యూస్ కార్నర్.
    సేవలు/ సరఫరా
    • బ్యూటీ పార్లర్.
    • సెంట్రింగ్.
    • క్లే ఇటుక తయారీ యూనిట్.
    • ఎగ్జాస్ట్ అనలైజర్/ పొల్యూషన్ చెక్ మెషిన్.
    • డిజిటల్ కేబుల్ నెట్వర్క్.
    • మినరల్ వాటర్ ప్లాంట్.
    • కాంక్రీట్ మిక్సర్/ మిల్లర్ (లిఫ్ట్).
    • షట్టర్లు మరియు ఫర్నిచర్ నిర్మాణం.
    • వెల్డింగ్ మిషనరీ.
    • వెల్డింగ్ షాప్.
    • మార్బుల్ పాలిషింగ్/ గ్రానైట్ కటింగ్/ పాప్.
    • ఆయిల్ మిల్లు, రైసు, పిండి, పప్పు, మిరప,
      పసుపు మిల్లు, తడి పిండి గ్రైండర్.
    • టైలరింగ్.
    • జిరాక్స్ సెంటర్.
    • పెట్ క్లినిక్.
    • డిజిటల్ ఫోటో స్టూడియో మరియు ల్యాబ్.
    • ఐరన్ గేట్లు/ గ్రిల్స్ తయారీ యూనిట్.
    • ఐరన్ గేట్లు/ గ్రిల్స్ యూనిట్.
    • కిచెన్ వేర్/ ఫర్నిచర్ షాప్.
    • పెట్రోల్ పంప్.
    • లాండ్రీ/ డ్రై క్లీనింగ్.
    • ల్యాండ్ సర్వే ఎక్విప్మెంట్.
    • మెడికల్ ఎక్విప్మెంట్.
    • వెహికిల్ సర్వీస్/ వాషింగ్ సెంటర్.
    • మెకానికల్ వర్క్స్.
    • డిటిపి, మీసేవ, సిఎస్సి ఆన్లైన్ సర్వీసెస్ సెంటర్.
    • ఎలక్ట్రికల్ షాపు & బ్యాటరీ సేవలు/అమ్మకం.
    • ఎలక్ట్రానిక్ గూడ్స్ షోరూం సేవలు/అమ్మకం.
    • ఫ్లెక్సీ/ వినైల్& డిజిటల్ ప్రింటింగ్.
    • ఫుడ్ & బేవరేజ్ రెస్టారెంట్.
    • రెసిడెన్షియల్ స్కూల్స్/ హాస్టళ్లకు ఫుడ్ & కూరగాయల సప్లై.
    • ఫుడ్ ప్రాసెసింగ్.
    • గార్డెన్.
    • హోటల్/ క్యాటరింగ్ సర్వీస్/ టి హబ్.
    • టెంట్ హౌస్, డెకరేషన్, లైటింగ్& డిజే సౌండ్ సిస్టం.
    • వీడియోగ్రఫీ & డ్రోన్ ఫోటోగ్రఫీ.
    • సెల్ఫోన్ సేల్స్/ సర్వీసెస్ యూనిట్.
    • CC కెమెరా సేల్స్/ సర్వీసెస్.
    • ATM సెంటర్.
    ట్రాన్స్పోర్ట్
    • ఆటో 7 సీటర్.
    • క్రేను.
    • అంబులెన్స్.
    • మినీ బస్.
    • పవర్ టిల్లర్.
    • టాటా ఏస్.
    • ట్రాక్టర్.
    • ట్రాక్టర్ & ట్రైలర్.
    • ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్/ సర్వీసింగ్ యూనిట్.
    • ఆటో రిక్షా ప్యాసింజర్ 3 వీలర్.
    • ఆటో ట్రాలీ - గూడ్స్ 3 వీలర్.
    • డోజర్.
    • జెసిబి.
    • హార్వెస్టర్.
    • మెటీరియల్/ ఎక్విప్మెంట్స్/ ఇంప్లిమెంట్స్/ టోల్స్.
    • ఎక్స్కవేటర్.
    • గూడ్స్ వెహికల్ (4 వీలర్/ డిసిఎం/ లారీ/ టిప్పర్).
    • 4 వీలర్ పై మొబైల్ టిఫిన్ సెంటర్.
    • 4 వీలర్ ప్యాసింజర్ వెహికల్.
    వర్కింగ్ క్యాపిటల్
    • వర్కింగ్ క్యాపిటల్.

ముఖ్యమైన లింక్స్

సంప్రదింపు వివరాలు

  • తెలంగాణ దళిత బంధు పథకం హెల్ప్ లైన్ నంబర్స్ :-
    • 09000289154.
    • 09000219154.
  • తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ సహకార అభివృద్ధి సంస్థ హెల్ప్ లైన్ నంబర్స్ :-
    • 18005992525.
    • 040-23315970.
  • తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ సహకార అభివృద్ధి సంస్థ హెల్ప్ డెస్క్ ఈమెయిల్ :-
    • md_tgsccfc@telangana.gov.in.
    • mdtgsccfc@gmail.com.
  • తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ సహకార అభివృద్ధి సంస్థ.
    విసి& మేనేజింగ్ డైరెక్టర్, SC సహకార అభివృద్ధి సంస్థ.
    5వ అంతస్తు, దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్,
    మాసబ్ ట్యాంక్, హైదరాబాద్- 500028.

Comments

వ్యాఖ్య

మీరు వెళ్లి PMEGP లోన్ కావలని అడగండి.
మీకు బ్యాంక్ వారు మిమ్మల్ని ప్రాజెక్ట్ రిపోర్టు తీసుకురమ్మని చెబుతారు మీకు ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ కింద 10 లక్షల వరకు ఐటీ లేకుండా లోను ఇస్తారు. దీనిలో గ్రామీణ ప్రాంతంలో మీరు వ్యాపారం ప్రారంభించినట్లయితే 35% సబ్సిడీ వస్తుంది అదేవిధంగా పట్టణ ప్రాంతంలో ప్రారంభించినట్లయితే 25% సబ్సిడీ వస్తుంది.

అదేవిధంగా ముద్ర లోన్ కింద మీకు 10 లక్షల వరకు ఎలాంటి ఐటీ రిటర్న్స్ లేకుండా ప్రభుత్వ బ్యాంకులు లోను అందజేస్తారు దానికి ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసుకుని వెళ్లి బ్యాంక్ అధికారులను కలవండి తప్పకుండా బ్యాంకు వారు మీకు సహాయం అందజేస్తారు.

వ్యాఖ్య

మాది నేలకొండపల్లి మండలం, గువ్వలగుడెం గ్రామం, ఖమ్మం జిల్లా. పాలేరు నియోజకవర్గం. మాది పేద కుంటుబం మకు దలితబందు ఇప్పించగలరు.

In reply to by Lachappagari L… (సరిచూడ బడలేదు)

స్థిరలంకె

వ్యాఖ్య

Lachappagari Lalitha kcr sar naku dalitabandu evvandi gandimysamma dundigal mondal dp pally medchal district 500043 phone number 9553937xxx

In reply to by Lachappagari p… (సరిచూడ బడలేదు)

స్థిరలంకె

వ్యాఖ్య

I what's dalitha bandu
V: Komati kondapur
M: ibrahimpatnam
D: Jagithyal
Pn: 505450
Rev: Metpally

వ్యాఖ్య

Sir maku dalitha bandhu chala avasaram sir na bharya pillalu chanipoye problems lo vunnu dayachesi Naku aadukondi sir please please please sir

వ్యాఖ్య

I want to prefer for ATM Machine in my own village, Basheerabad mdl: Kammarpally, Dist: ,in Balkonda Constancy

వ్యాఖ్య

రెండో విడత దళిత బంధు మేడ్చల్ లో ఇవ్వడం ప్రారంభం అయ్యిందా సార్

వ్యాఖ్య

Sir memu sc madiga memu chala pedha vallu memu dalitha bandu kosam try chestunnam evaru ivvadam ledu maku ee scheme ivvalani korukuntunna na request ni konchem choodagalaru

వ్యాఖ్య

Sir i need this sheme i have three childrens my husband is labour i have completed my tenth class I want to open retail shop I suffer very much in house essential and for job please help me 🙏

వ్యాఖ్య

dalitha bandhu ela aplly chesukovali ekada aplly cheyali kodhiga clear ga chepandi sir/medam form ela untadhi ikada evarini adigina patinchukodam ledhu memu sc - mala website lo login lo user id and possword ela create chesukovali procese chepandi plzzz sir/medam

వ్యాఖ్య

Subject : sir, please stop dalitha bandhu for Munigalaveedu village Nellikudur mandal mahabubabad district 506101.sir Dalitha bandhu only dalithule arhulu kani nijamina arhulaku evvakunda Karya karthalaku matrame estunnaru trs lo thirigina SC madhiga dalithulaku evvadam ledu anduke e village ki hold cheyyandi serve chains tharvatha ne evvandi. Present rakunda cheyandi please 🙏🙏

స్థిరలంకె

వ్యాఖ్య

Lachappagari Lalitha kcr sar naku dalitabandu evvandi gandimysamma dundigal mondal dp pally medchal 500043nenu sc madiga

వ్యాఖ్య

Sir mi pathakalu bagunay kani avi arhulu ayyevariki velthunaya leda kanukondi undaniki illu ledhu ledhu region ledhu kani amayaka prajalani mosam chesi unnoniki isthunaru jara chudandi sir mi pathakalu anni bagunay kani madhya tharagathi vallaku ravatledu sir

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.