తెలంగాణ చేయూత పెన్షన్ పథకం

author
Submitted by shahrukh on Thu, 02/05/2024 - 13:14
తెలంగాణ CM
Scheme Open
Highlights
  • రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ రూ. 10 లక్షలు.
  • పెన్షనర్ కేటగిరీ ప్రకారం నెలకు నెలవారీ పెన్షన్‌ను అనుసరించడం కూడా చేయూత పెన్షన్ పథకం కింద అందించబడుతుంది :-
    పెన్షనర్ కేటగిరీ నెలవారీ
    పెన్షన్‌
    వృద్దులు/ పెద్ద వయస్సు గల వారు రూ. 4000/-
    భర్త లేని వారు రూ. 4000/-
    ఒంటరి మహిళ రూ. 4000/-
    వికలాంగులు రూ. 6000/-
    బండ కొట్టేవాళ్ళు రూ. 4000/-
    బీడీ చేసేవాళ్ళు రూ. 4000/-
    చేనేత కార్మికులు రూ. 4000/-
    ఎయిడ్స్ బాధితులు రూ. 4000/-
    డయలసిస్ ఉన్నవారు రూ. 4000/-
    ఫైలేరియా ఉన్న వారు రూ. 4000/-
Customer Care
  • తెలంగాణ చేయూత పెన్షన్ పథకం సంప్రదింపు వివరాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన వెంటనే విడుదల చేస్తుంది.
పథకం వివరాలు
పథకం పేరు తెలంగాణ చేయూత పెన్షన్ పథకం.
ఉపయోగాలు నెలసరి పెన్షన్ రూ. 4000/-.
ఉపయోగాలు పొందేవారు
  • వృద్దులు/ పెద్ద వయస్సు గల వారు.
  • భర్త లేని వారు.
  • ఒంటరి మహిళ.
  • వికలాంగులు.
  • బీడీ చేసేవాళ్ళు.
  • బండ కొట్టేవాళ్ళు.
  • చేనేత కార్మికులు.
  • ఎయిడ్స్ బాధితులు.
  • ఫైలేరియా/ డయలసిస్ ఉన్నవారు.
నోడల్ విభాగం ఇంకా తెలియలేదు.
సబ్స్క్రిప్షన్ పతకం  వివరాల కోసం సబ్క్రిబ్ చేయండి.
దరఖాస్తు చేసే విదం తెలంగాణ చేయూత పెన్షన్ పథకం దరఖాస్తు ఫారం ద్వారా చేయండి.

పరిచయం

  • అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో 30 వ తారీకున నవంబర్ నెలలో 2023 లో జరిగాయి.
  • ఎన్నికల ఫలితం డిసెంబర్, 03 తారికున 2023 లో ప్రకటించబడింది.
  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో సాధించింది.
  • ఓటర్లను ఆకట్టకునేందుకు ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రకటించింది.
  • చేయూత పెన్షన్ పథకం కూడా ఎన్నికల ముందు ప్రకటించబడింది మరియు అది అమలులోకి వచ్చిన తరువాత సామాజిక అత్యంత అవసరమైన పథకంలో ఒకటిగా మారనుంది.
  • చేయూత పెన్షన్ పథకాన్ని ప్రకటించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం తెలంగాణలోని నిరుపేద ప్రజలను ఆదుకోవడానికి  ఆరోగ్య రక్షణ మరియు పెన్షన్ ఆర్ధిక సహాయం అందించడం.
  • చేయూత పెన్షన్ పథకం తెలంగాణలో అతి త్వరలో అమలు చేయబోతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వాగ్దానం చేసింది.
  • తెలంగాణ చేయూత పెన్షన్ పథకలలో ఉప పథకాలు ఏమిటి అంటే :-
    • తెలంగాణ వృద్యప్య పెన్షన్ పథకం.
    • తెలంగాణ వితంతు పెన్షన్ పథకం.
    • తెలంగాణ వికలాంగుల పెన్షన్ పథకం.
    • తెలంగాణ ఒంటరి మహిళల పెన్షన్ పతకం.
    • తెలంగాణ బీడీ కార్మికుల పెన్షన్ పథకం.
    • తెలంగాణ చేనేత కార్మికుల పెన్షన్ పథకం.
    • తెలంగాణ బండ కొట్టేవారికి పెన్షన్ పథకం.
    • తెలంగాణ ఎయిడ్స్ బాధితుల పెన్షన్ పథకం.
    • తెలంగాణ డయలసిస్ పేషెంట్ పెన్షన్ పథకం.
  • తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తన కొత్త చేయూత పెన్షన్ పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన మరియు నిరుపేద ప్రజలందరికీ నెలవారీ పెన్షన్‌ను అందజేస్తుంది.
  • నెలసరి పెన్షన్ రూ.4000/- తెలంగాణ చేయూత పెన్షన్ పథకం కింద అందించబడుతుంది.
  • వికలాంగులకు చేయూత పెన్షన్ పథకం కింద నెలకు రూ. 6000/- ఇవ్వబడును.
  • నెలవారీ పెన్షన్ తో పాటు, ఆరోగ్య భీమా రూ. 10,00,000/- రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా కింద తెలంగాణ చేయూత పథకం కింద అర్హులైన వారికి అందించబడును.
  • తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడింది మరియు ఇప్పుడు ముఖ్య మంత్రి శ్రీ.రేవంత్ రెడ్డి.
  • తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చేయూత పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
  • తెలంగాణ ప్రభుత్వ చేయూత పెన్షన్ పథకం కింద వాగ్దానం చేసిన విధంగా ఇప్పుడు ఆరోగ్య బీమా మరియు నెలవారీ పెన్షన్‌ను దరఖాస్తు చేసుకోవచ్చు మరియు పొందవచ్చు.
  • తెలంగాణ చేయూత పెన్షన్ స్కీమ్ దరఖాస్తు ఫారమ్‌ను ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • చేయూత పెన్షన్ స్కీమ్ యొక్క దరఖాస్తు ఫారమ్‌ను  నింపండి మరియు దానిని గ్రామ సభ/ గ్రామ పంచాయతీ/ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సమర్పించండి.

Telangana Cheyutha Pension Scheme Information

పథకం యొక్క లాభాలు

  • తెలంగాణ చేయూత పెన్షన్ పథకం కింద అర్హులైన వారికి కొత్తగా ఏర్పడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ కింది ప్రయోజనాలను అందిస్తుంది :-
    • రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ రూ. 10 లక్షలు.
    • పెన్షనర్ కేటగిరీ ప్రకారం నెలకు నెలవారీ పెన్షన్‌ను అనుసరించడం కూడా చేయూత పెన్షన్ పథకం కింద అందించబడుతుంది :-
      పెన్షనర్ కేటగిరీ నెలవారీ
      పెన్షన్‌
      వృద్దులు/ పెద్ద వయస్సు గల వారు రూ. 4000/-
      భర్త లేని వారు రూ. 4000/-
      ఒంటరి మహిళ రూ. 4000/-
      వికలాంగులు రూ. 6000/-
      బండ కొట్టేవాళ్ళు రూ. 4000/-
      బీడీ చేసేవాళ్ళు రూ. 4000/-
      చేనేత కార్మికులు రూ. 4000/-
      ఎయిడ్స్ బాధితులు రూ. 4000/-
      డయలసిస్ ఉన్నవారు రూ. 4000/-
      ఫైలేరియా ఉన్న వారు రూ. 4000/-

అర్హత

  • తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ చేయూత పెన్షన్ పథకం కింద నెలవారీ పెన్షన్ ప్రయోజనాన్ని అందించడానికి లబ్ధిదారులకు క్రింది అర్హత షరతులను సెట్ చేసింది :-
    • పొందేవారు తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి.
    • పొందేవారు కింద ఇచ్చిన వాటిలో దేనికయినా చేందినవడై ఉండాలి :-
      • వృద్దులు/ పెద్ద వయస్సు గల వారు.
      • భర్త లేని వారు.
      • ఒంటరి మహిళ.
      • వికలాంగులు.
      • బీడీ చేసేవాళ్ళు.
      • బండ కొట్టేవాళ్ళు.
      • చేనేత కార్మికులు.
      • ఎయిడ్స్ బాధితులు.
      • ఫైలేరియా/డయలసిస్ ఉన్నవారు.
    • చేయూత పెన్షన్ పథకం యొక్క మిగిలిన అర్హత షరతులు దాని అమలు తర్వాత విడుదల చేయబడతాయి.

కావలసిన పత్రాలు

  • తెలంగాణ ప్రభత్వ చేయూత పెన్షన్ పథకం కింద నెలసరి పెన్షన్ కోసం దరఖాస్తు చేసే సమయంలో ఈ కింది పాత్రలు అవసరం :-
    • ఏదైనా ఒక పత్రం వయస్సు రుజువు కోసం :-
      • జనన ధృవీకరణ పత్రం.
      • గుర్తింపు కార్డ్.
      • వైద్య ధృవీకరణ పత్రం.
    • ఆధార్ కార్డు.
    • ఆహార భద్రత కార్డ్/ రేషన్ కార్డు.
    • మొబైల్ నంబర్.
    • బ్యాంక్ ఖాతా వివరాలు.
    • పాస్పోర్ట్ సైజ్ ఫోటో.
    • పెన్షన్ దరఖాస్తు చేసేవారికి కావలసిన వర్గం వారికి పత్రాలు అవసరం :-
      • సదరెం/వైకల్యం పత్రం. (వికలంగుల కోసం)
      • భర్త ఆధార్ కార్డు. (భర్త లేని వారికోసం)
      • పెళ్లి కాలేదు అనే పత్రం. (ఒంటరి మహిళ కోసం)
      • చేనేత కార్మికుల కార్డ్.
      • ఈపీఫ్ నమోదు కార్డ్. (బీడీ కార్మికుల కోసం)
      • బండ కొట్టేవారి రుజువు. (బండ కొట్టెవారి కోసం)
      • ఎయిడ్స్ ఉన్న వారి మెడికల్ సర్టిఫికేట్.
      • ఫైలేరియా/ డయాలసిస్ వారి మెడికల్ సర్టిఫికేట్.

ఎలా దరఖాస్తు చేయాలి

  • దరఖాస్తు చేసేవారు తెలంగాణ చేయూత పెన్షన్ పథకం కింద నెలవారీ ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
  •  తెలంగాణ చేయూత పెన్షన్ పథకం దరఖాస్తు ఫారంని మునిసిపల్ కార్పొరేషన్ ఆఫీస్/ గ్రామ సభ ఆఫీస్/ గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి తీసుకోగలరు.
  • చేయూత పెన్షన్ పథకం దరఖాస్తు ఫారం తీసుకోండి మరియు జాగ్రత్తగా నింపండి.
  • దరఖాస్తుదారులు సరైన వర్గం ని టిక్ పెట్టగలరు ఎందుకంటే సరైన వర్గాన్ని ఎంచుకోవడం కోసం.
  • అవసరమైన పత్రాలు దరఖాస్తు ఫారం తో జతపరచండి.
  • తెలంగాణ చేయూత పెన్షన్ పథకం దరఖాస్తు ఫారంనీ వాటి యొక్క పత్రాలతో అదే ఆఫీస్ లో అంటే ఇక్కడ అయితే దరఖాస్తు ఫారాన్ని తీసుకున్నారో అక్కడే ఇవ్వండి.
  • సంబంధిత శాఖ అధికారులు దరఖాస్తు ఫారంలోని వివరాలను మరియు పత్రాలను పరిశీలిస్తారు.
  • నెలకు చేయూత పింఛను కోసం ఎంపికైన వారిని అప్పుడు లిస్ట్ తయారు చేయబడుతుంది.
  • తెలంగాణ చేయూత పింఛను పథకంలో వారి ఎంపిక గురించి ఎంపిక అయినా వారికి వారి మొబైల్ ఫోన్‌లో SMS ద్వారా తెలియజేయబడుతుంది.
  • ఎంపికైన వారికి నెలకు రూ. పెన్షన్‌గా ఆర్థిక సహాయం అందుతుంది. తెలంగాణ ప్రభుత్వం చేయూత పెన్షన్ పథకం కింద 4,000/- (వికలాంగులకు రూ. 6,000/-) ఇస్తుంది.
  • తెలంగాణ ప్రభుత్వ చేయూత పెన్షన్ పథకానికి అర్హులైన వారు 28-12-2023 నుండి 06-01-2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అవసరమైన లింక్

సంప్రదించ వలసిన వివరములు

  • తెలంగాణ చేయూత పెన్షన్ పథకం సంప్రదింపు వివరాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన వెంటనే విడుదల చేస్తుంది.

Comments

స్థిరలంకె

వ్యాఖ్య

I was not received to my ts aasara pension of july24 month ammount till today 29/82/24 already pension sanctioned updated in govt portal on 11/8/24 I enquiry to concerned departments on phone Tollfree, landlines, emails. But not lift my calls and not reply my emails
Pl do the need full

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.