Highlights
- రైతులకు ఒక ఎకరానికి, సంవత్సరానికి 10,000/- చొప్పున ఇవ్వబడును :-
- రైతులకు రబీ పంటకు ఎకరానికి Rs. 5,000/- చొప్పున ఇవ్వబడును.
- రైతులకు ఖరీఫ్ పంటకు ఎకరానికి Rs. 5,000/- చొప్పున ఇవ్వబడును.
Customer Care
- తెలంగాణ రైతుబంధు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం హెల్ప్ లైన్ నెంబర్ :- 040-23383520.
- డి ఏ ఓ సంప్రదింపు వివరాలు.
- ఏడిఏ సంప్రదింపు వివరాలు.
- ఎం ఏ ఓ సంప్రదింపు వివరాలు.
- ఏ ఈ ఓ సంప్రదింపు వివరాలు.
Information Brochure
పథకం వివరాలు
|
|
---|---|
పథకం పేరు | తెలంగాణ రైతు బంధు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం |
ప్రారంభించిన సంవత్సరం | 25 ఫిబ్రవరి 2018. |
లక్ష్యం | రైతులకు స్వావలంబనను కల్పించి వ్యవసాయానికి అవసరమయ్యే వస్తువుల కొనుగోలులో సహకరించడం. |
లాభాలు | రైతులకు ఎకరానికి Rs. 10,000/- చొప్పున ప్రతి సంవత్సరం ఆర్థిక సహకారం ఇవ్వబడును. |
నోడల్ విభాగం | వ్యవసాయ సహకార విభాగం |
సబ్స్క్రిప్షన్ | పథకం వివరాల కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. |
పరిచయం
- రైతు బంధు పథకం తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆర్థిక సహకార పథకం.
- తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఈ పథకాన్ని 25 ఫిబ్రవరి 2018 న ప్రారంభించారు.
- ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలోని చిన్న మరియు సన్నకారు రైతులకు వర్తిస్తుంది.
- ఈ పథకాన్ని వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం అని కూడా అంటారు.
- ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం రైతుల ఆదాయాన్ని పెంచడం. తద్వారా రైతులకు స్వావలంబన చేకూర్చి వ్యవసాయానికి అవసరమయ్యే వస్తువుల కొనుగోలుకు సహకరించడం.
- ఈ పథకం ద్వారా, ప్రతి రైతుకు, సంవత్సరంలో ఒక ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వబడును.
- ఈ 10,000/- రూపాయలలో 5,000/- రబీ సీజన్ పంటలకు మరియు 5,000/- ఖరీఫ్ సీజన్ పంటలకు ఇవ్వబడును.
- కింద ఇవ్వబడిన పంటకు సంబంధించిన వస్తువులకు ఈ ఆర్థిక సహకారం ఇవ్వబడును :-
- విత్తనాలు.
- ఫర్టిలైజర్స్.
- పెస్టిసైడ్స్.
- కూలీలు.
- అదనపు పెట్టుబడి.
- 2018-2019 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి 12,000 కోట్ల బడ్జెట్ ను మంజూరు చేసింది.
- ఈ పథకం కింద, ఆర్థిక సహకారం రైతులకు ప్రత్యక్షంగా ఇవ్వబడును.
- ఇది భారతదేశంలో మొదటి ప్రత్యక్ష రైతు పెట్టుబడి మద్దతు పథకం.
- తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల రైతులకు పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.
లాభాలు
- రైతులకు ఒక ఎకరానికి, సంవత్సరానికి 10,000/- చొప్పున ఇవ్వబడును :-
- రైతులకు రబీ పంటకు ఎకరానికి Rs. 5,000/- చొప్పున ఇవ్వబడును.
- రైతులకు ఖరీఫ్ పంటకు ఎకరానికి Rs. 5,000/- చొప్పున ఇవ్వబడును.
అర్హత
- రైతులు తెలంగాణ రాష్ట్ర నివాసులై ఉండాలి.
- చిన్న లేదా సన్న కారు రైతులే ఉండాలి.
- పంట భూమి రైతు పేరు మీద నమోదయి ఉండాలి.
అనర్హులు
- వాణిజ్య మరియు సంపన్నులైన రైతులు.
- కాంట్రాక్టు రైతులు.
అవసరమైన పత్రాలు
- నివాస ధ్రువీకరణ పత్రం.
- భూమి యాజమాన్య ధ్రువీకరణ పత్రం.
- ఆధార్ కార్డు.
- క్యాస్ట్ సర్టిఫికెట.్ (SC/ST/OBC విభాగానికి చెందిన రైతులు)
- BPL సర్టిఫికెట్. (BPL విభాగానికి చెందిన రైతులు)
- బ్యాంకు పాస్ బుక్.
పథకం వివరాలు
- రైతు బంధు పథకం లేదా వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం 2018-2019 సంవత్సరంలో ప్రారంభించబడింది.
- ఈ పథకం కింద రైతులకు, సంవత్సరంలో ఎకరానికి ఒక పంటకు 5,000/- చొప్పున ఇవ్వబడును.
- రైతులు ఈ ఆర్థిక సహకారాన్ని, విత్తనాలు, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, కూలీ, మరియు ఇతర పెట్టుబడులకు ఉపయోగించుకోవచ్చు.
- రైతులకు ఈ ఆర్థిక సహకారం బ్యాంకు చెక్కు ద్వారా ఇవ్వబడును.
- ఈ బ్యాంకు చెక్కుల ద్వారా రైతులు తమ గుర్తింపును నిరూపించుకొని నగదును పొందవచ్చు.
- రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక బ్యాంకు ఈ పథకం కోసం నియమించబడింది.
- రైతులు నియమించబడిన బ్యాంకు యొక్క ఏ బ్రాంచీలో అయినా నగదును పొందవచ్చును.
- బ్యాంకు చెక్కు తో పాటు, తెలంగాణ ప్రభుత్వం కొత్త పట్టాదారు పాస్ బుక్కులను రైతులకు అందజేస్తుంది.
- ఈ కొత్త పాస్ బుక్కు అత్యంత సురక్షితమైనది. ఇది 17 భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది.
- బ్యాంకు చెక్కు కింద ఇవ్వబడిన వివరాలు కలిగి ఉంటుంది :-
- పథకం పేరు “రైతుబంధు”.
- పట్టాదారు పేరు మరియు పట్టాదారు పాస్బుక్ నెంబర్.
- రెవెన్యూ ఊరు మండలం మరియు జిల్లా.
- నగదు మొత్తం.
- వ్యవసాయ కమిషనర్ మరియు డైరెక్టర్ యొక్క సంతకం.
- ఒకవేళ నగదు మొత్తం 50,000/- లేదా 50,000/- కు మించినట్లయితే, బ్యాంకు రెండు చెక్కులను ఇస్తుంది.
- బ్యాంకు చెక్కు పట్టాదారునికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కు నామినీలకు ఇవ్వబడదు.
ఎలా లబ్ధి పొందాలి?
- తహసీల్దారు (MRO) కార్యాలయంలో సంబంధిత అధికారులను సంప్రదించండి.
నియమింపబడ్డ బ్యాంకులు
బ్యాంకు పేరు | మండల కౌంట్ |
---|---|
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 3398430 |
ఆంధ్ర బ్యాంక్ | 2689156 |
సిండికేట్ బ్యాంక్ | 903696 |
కార్పొరేషన్ బ్యాంక్ | 315277 |
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ | 601562 |
కెనరా బ్యాంక్ | 595743 |
AP గ్రామీణ వికాస్ బ్యాంక్ | 1323887 |
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ | 945170 |
ఐడిబిఐ బ్యాంక్ | 107002 |
టి ఎస్ సి ఏ బి | 205643 |
ముఖ్యమైన అప్లికేషన్ పత్రాలు
- తెలంగాణ రైతుబంధు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం క్లెయిమ్ ఫామ్.
- తెలంగాణ రైతుబంధు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ ప్రమాణీకరణ డ్రాఫ్ట్ డిక్లరేషన్.
- తెలంగాణ రైతుబంధు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం బ్యాంకు వివరాల కలెక్షన్ ఫామ్.
- తెలంగాణ రైతుబంధు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం గివ్ ఇట్ అప్ పర్ఫార్మా.
ముఖ్యమైన లింక్స్
- తెలంగాణ రైతుబంధు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం అధికారిక వెబ్సైట్.
- తెలంగాణ రైతుబంధు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం అధికారిక మార్గదర్శకాలు.
- తెలంగాణ రైతుబంధు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం చెక్కుల పంపిణీ వేదిక వివరాల జాబితా.
- తెలంగాణ రైతుబంధు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం విభాగం లాగిన్.
- తెలంగాణ రైతుబంధు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం మొబైల్ యాప్.
సంప్రదింపు వివరాలు
- తెలంగాణ రైతుబంధు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం హెల్ప్ లైన్ నెంబర్ :- 040-23383520.
- డి ఏ ఓ సంప్రదింపు వివరాలు.
- ఏడిఏ సంప్రదింపు వివరాలు.
- ఎం ఏ ఓ సంప్రదింపు వివరాలు.
- ఏ ఈ ఓ సంప్రదింపు వివరాలు.
- వ్యవసాయ కమిషనర్ మరియు డైరెక్టర్ చిరునామా,
గ్రౌండ్ ఫ్లోర్, డి బ్లాక్,
ఫతే మైదాన్, బషీర్బాగ్,
నిజాం కాలేజ్ బషీర్బాగ్,
హైదరాబాద్, తెలంగాణ, 500001.
Also see
Scheme Forum
Caste | Person Type | Scheme Type | Govt |
---|---|---|---|
Matching schemes for sector: Agriculture
Sno | CM | Scheme | Govt |
---|---|---|---|
1 | తెలంగాణ రైతు భరోసా పథకం | తెలంగాణ |
Matching schemes for sector: Agriculture
Sno | CM | Scheme | Govt |
---|---|---|---|
1 | Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) | CENTRAL GOVT | |
2 | Pradhan Mantri Fasal Bima Yojana (PMFBY) | CENTRAL GOVT | |
3 | राष्ट्रीय कृषि बीमा योजना | CENTRAL GOVT | |
4 | प्रधानमंत्री कृषि सिंचाई योजना | CENTRAL GOVT | |
5 | Kisan Call Center (KCC) | CENTRAL GOVT | |
6 | Fertilizer Subsidy Scheme 2022 | CENTRAL GOVT | |
7 | National Agriculture Market (e-NAM) | CENTRAL GOVT | |
8 | Pradhan Mantri Kisan Maandhan Yojana | CENTRAL GOVT | |
9 | Micro Irrigation Fund | CENTRAL GOVT | |
10 | Kisan Credit Card | CENTRAL GOVT | |
11 | ग्रामीण भण्डारण योजना | CENTRAL GOVT | |
12 | Pradhan Mantri Kusum Yojana | CENTRAL GOVT |
Subscribe to Our Scheme
×
Stay updated with the latest information about రైతు బంధు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం
Comments
ఇది కూడా కౌలు భూమి ఉన్న…
నా చెల్లింపు ఆలస్యం అయిన…
Raithbandhu
Sir I have 25 guntas land I will got it rayath bandu 3125 but this time not created by the ammount
can a PM Kisan benficiary…
పొలంలో ఏ పంటనైనా వేసుకోవచ్చు…
is there any scheme of this…
Pm kisan samman nidhi money…
Pm kisan samman nidhi money no come
rythu bandhu beneficiary list
rythu bandhu beneficiary list
వ్యాఖ్యానించండి