కళ్యాణ లక్ష్మి పథకం

author
Submitted by shahrukh on Thu, 02/05/2024 - 13:14
తెలంగాణ CM
Scheme Open
Highlights
  • తెలంగాణ ప్రభుత్వం కింద ఇవ్వబడిన ఆర్థిక సహకారాన్ని కల్యాణ లక్ష్మి పథకం కింద అమ్మాయిల పెళ్లి కోసం అందజేస్తుంది :-
    • Rs. 1,00,116/- (ఒక లక్ష ఒక వ0ద పదహారు రూపాయలు) ఆర్థిక సహకారం.
Customer Care
  • కళ్యాణ లక్ష్మి పథకం హెల్ప్ లైన్ నెంబర్ :- 040 23390228.
  • కల్యాణ లక్ష్మి పథకం హెల్ప్ డెస్క్ ఈమెయిల్ :- help.telanganaepass@cgg.gov.in.
పథకం వివరాలు
పథకం పేరు కళ్యాణ లక్ష్మి పథకం.
ప్రారంభించిన తేదీ 2 అక్టోబర్ 2014.
లాభాలు పెళ్లి ఖర్చులకు సరిపడా ఆర్థిక సహకారం.
ఆర్థిక సహకారం ఒకే దశలో Rs. 1,00,116/- ల ఆర్థిక సహకారం.
నోడల్ విభాగం వెనుకబడిన తరగతుల సంక్షేమ విభాగం, తెలంగాణ.
సబ్స్క్రిప్షన్ పథకం యొక్క వివరాల కొరకు ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.
అప్లై చేసే పద్ధతి తెలంగాణ కల్యాణ లక్ష్మి పథకం అప్లికేషన్ ఫామ్.

పరిచయం

  • కళ్యాణ లక్ష్మి పథకం తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రముఖ పథకం.
  • ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు అక్టోబర్ 2, 2014 న ప్రారంభించారు.
  • రాష్ట్రంలోని, పెళ్లి ఖర్చులు భరించలేని, పేద కుటుంబాలలో ఉన్న వధువులకు తమ పెళ్లి కోసం ఆర్థిక సహకారాన్ని అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
  • ఈ పథకం మొదట్లో, కేవలం Rs. 51,000/- ల ఆర్థిక సహకారం మాత్రమే అందజేయబడింది.
  • కానీ 2017 లో, ఆర్థిక సహకారం అందజేయబడు నగదు Rs. 75,116/- కు పెంచబడింది.
  • కళ్యాణ లక్ష్మి పథకం కింద అందజేయబడే ఆర్థిక సహకారం నగదు మరల 2018లో సవరించబడింది.
  • ఇప్పుడు వధువులకు తమ పెళ్లి కోసం తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం కింద అందజేసే ఆర్థిక సహకారం Rs. 1,00,116/-.
  • షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన అమ్మాయిలు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆర్థిక సహకారాన్ని పొందడానికి అర్హులు.
  • షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ తెగల కుటుంబాలు, ఈ పథకం ద్వారా ఆర్థిక సహకారాన్ని పొందాలంటే, తమ సంవత్సర తలసరి ఆదాయం Rs. 2,00,000/- కు మించి ఉండరాదు.
  • వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కుటుంబాల సంవత్సర తలసరి ఆదాయం అర్బన్ ఏరియాస్ లో Rs. 2,00,000/- మరియు రూరల్ ఏరియాస్ లో 1,50,000/- మించి ఉండరాదు.
  • అర్హులైన వధువులు తెలంగాణ కల్యాణ లక్ష్మి పథకం కింద ఆర్థిక సహకారాన్ని పొందాలంటే కళ్యాణ లక్ష్మి పథకం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా అప్లై చేయాలి.
  • కళ్యాణ లక్ష్మి పథకం ఆన్లైన్ అప్లికేషన్ స్టేటస్ ను ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఆర్థిక సహకారం

  • తెలంగాణ ప్రభుత్వం కింద ఇవ్వబడిన ఆర్థిక సహకారాన్ని కల్యాణ లక్ష్మి పథకం కింద అమ్మాయిల పెళ్లి కోసం అందజేస్తుంది :-
    • Rs. 1,00,116/- (ఒక లక్ష ఒక వ0ద పదహారు రూపాయలు) ఆర్థిక సహకారం.

అర్హత

  • వధువులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలి.
  • వధువుల వయసు 18 సంవత్సరాలకు మించి ఉండాలి.
  • వధువులు కింద ఇవ్వబడిన వర్గానికి చెందిన వారై ఉండాలి :-
    • షెడ్యూల్డ్ తెగలు.
    • షెడ్యూల్ క్యాస్ట్.
    • ఆర్థికంగా వెనుకబడిన తరగతులు.
    • వెనుకబడిన తరగతులు.
  • వధువు కుటుంబ సంవత్సర ఆదాయ పరిమితి :-
    కులం ఆదాయ పరిమితి
    SC సంవత్సరానికి Rs. 2,00,000/- కన్న తక్కువ ఉండాలి.
    ST సంవత్సరానికి Rs. 2,00,000/- కన్న తక్కువ ఉండాలి.
    BC/ EBC
    • అర్బన్ :- Rs. 2,00,000/-.
    • రూరల్ :- Rs. 1,50,000/-.

అవసరమైన పత్రాలు

  • తెలంగాణ కల్యాణ లక్ష్మి పథకం ద్వారా, వివాహానికి సరిపడు ఆర్థిక సహకారాన్ని పొందాలంటే, పథకానికి అప్లై చేసే సమయంలో కింద ఇవ్వబడిన పత్రాలు అవసరమవుతాయి :-
    • వధువు ఫోటో.
    • వధువు వయసు ధ్రువీకరణ పత్రం.
    • వధువు ఆధార్ కార్డు కాపీ.
    • వధువు తల్లి ఆధార్ కార్డు కాపీ.
    • వరుడి ఆధార్ కార్డు కాపీ.
    • వధువు తల్లి బ్యాంకు పాస్ బుక్.
    • వధువు బ్యాంకు పాస్ బుక్.
    • మొదటి పెళ్లి ధ్రువీకరణ పత్రం.
    • క్యాస్ట్ సర్టిఫికెట్.
    • ఆదాయ ధ్రువీకరణ పత్రం.
    • విలేజ్ రెవెన్యూ ఆఫీసర్/ పంచాయతీ సెక్రటరీ అంగీకరణ పత్రం.

అప్లై చేసే పద్ధతి

  • అర్హులైన వధువులు తెలంగాణ కల్యాణ లక్ష్మి పథకం కింద ఆర్థిక సహకారాన్ని పొందాలంటే కళ్యాణ లక్ష్మి పథకం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా అప్లై చేయాలి.
  • కళ్యాణ లక్ష్మి పథకం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తెలంగాణ ప్రభుత్వం యొక్క ఈపాస్ పోర్టల్ లో లభిస్తుంది.
  • న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి.
  • కింద ఇవ్వబడిన వివరాలను తెలంగాణ కల్యాణ లక్ష్మి పథకం రిజిస్ట్రేషన్ ఫామ్ లో నింపాలి :-
    1. వధువు వివరాలు
    • అందుబాటులో ఉన్న SSC లేదా దానికి సరిపడా వివరాలు (అవును or కాదు).
    • వధువు పేరు.
    • తండ్రి పేరు.
    • పుట్టిన తేదీ.
    • ఆధార్ నంబర్.
    • చదువు సంబంధిత వివరాలు.
    • ఫోన్ నెంబర్.
    • క్యాస్ట్.
    • సబ్ కాస్ట్.
    • అనాధ వివరాలు (అవును or కాదు).
    • తల్లి పేరు.
    • తల్లి ఆధార్ నెంబర్.
    • వికలాంగులు (అవును or కాదు).
    2. ఆదాయ సర్టిఫికెట్ వివరాలు
    • మీసేవ నంబర్.
    • దరఖాస్తుదారుల పేరు.
    • తండ్రి పేరు.
    • జిల్లా.
    • మండలం.
    • మండల రెవెన్యూ అధికారి పేరు.
    • మొత్తం ఆదాయం.
    3. క్యాస్ట్ సర్టిఫికెట్ వివరాలు
    • మీసేవ నంబర్.
    • దరఖాస్తుదారుల పేరు.
    • తండ్రి పేరు.
    • జిల్లా.
    • మండలం.
    • మండల రెవెన్యూ అధికారి పేరు.
    • క్యాస్ట్.
    4. శాశ్వత అడ్రస్
    • అడ్రస్ లైన్ 1.
    • అడ్రస్ లైన్ 2.
    • జిల్లా.
    • మండలం.
    • ఊరు.
    • పిన్కోడ్.
    5. ప్రస్తుత అడ్రస్
    • ఒకవేళ శాశ్వత అడ్రస్ మరియు ప్రస్తుత అడ్రస్ ఒకటే అయితే ఇవ్వబడిన బాక్సులో చెక్ చేయండి.
    6. బ్యాంకు ఖాతా వివరాలు (అనాధలకు మాత్రమే వర్తిస్తుంది)
    • ఖాతాదారుని పేరు.
    • జిల్లా.
    • బ్యాంక్ పేరు.
    • బ్యాంకు IFSC కోడ్/ బ్రాంచ్ పేరు.
    • బ్యాంకు ఖాతా నెంబర్.
    7. తల్లి బ్యాంకు ఖాతా వివరాలు (తప్పనిసరి)
    • ఖాతాదారుని పేరు.
    • జిల్లా.
    • బ్యాంక్ పేరు.
    • బ్యాంకు IFSC కోడ్/ బ్రాంచ్ పేరు.
    • బ్యాంకు ఖాతా నెంబర్.
    8. వరుడి వివరాలు
    • అందుబాటులో ఉన్న SSC లేదా దానికి సరిపడా వివరాలు (అవును or కాదు).
    • వరుడు పేరు.
    • తండ్రి పేరు.
    • పుట్టిన తేదీ.
    • ఆధార్ నెంబర్.
    • చదువు సంబంధిత వివరాలు.
    • మతం.
    • క్యాస్ట్.
    • సబ్ కాస్ట్.
    • కుటుంబ ఆదాయం.
    • ప్రస్తుత వృత్తి.
    9. శాశ్వత అడ్రస్
    • అడ్రస్ లైన్ 1.
    • అడ్రస్ లైన్ 2.
    • జిల్లా.
    • మండలం.
    • ఊరు.
    • పిన్కోడ్.
    10. వివాహ వివరాలు
    • వివాహం తేదీ.
    • వివాహం జరిగిన చోటు (గుడి పేరు/ కళ్యాణ మండపం పేరు/ ఇతర వివరాలు).
    • వివాహం జరిగిన చోటు అడ్రస్.
    11. అప్లోడ్ చేయవలసిన పత్రాలు
    • మొదటి పెళ్లి ధ్రువీకరణ పత్రం.
    • విలేజ్ రెవెన్యూ ఆఫీసర్/ పంచాయతీ సెక్రటరీ అంగీకార పత్రం.
    • వధువు ఫోటో.
    • వధువు వయసు ధ్రువీకరణ పత్రం.
    • వధువు ఆధార్ కార్డు కాపీ.
    • వధువు తల్లి ఆధార్ కార్డు కాపీ.
    • వరుడు ఆధార్ కార్డు కాపీ.
    • వధువు తల్లి బ్యాంకు పాస్ బుక్.
    • వధువు బ్యాంకు పాస్ బుక్.
  • అప్లికేషన్ ఫామ్ను సబ్మిట్ చేయడానికి, క్యాప్చ ఫిల్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి.
  • తెలంగాణ కల్యాణ లక్ష్మి పథకం అప్లికేషన్ ఫామ్ వెరిఫికేషన్ కోసం సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేయబడుతుంది.
  • వెరిఫికేషన్ తర్వాత, సంక్షేమ అధికారుల ద్వారా వధువు యొక్క తల్లి బ్యాంకు ఖాతాలోకి చెక్కు అందజేయబడుతుంది.
  • వధువులు తెలంగాణ కల్యాణ లక్ష్మి పథకం అప్లికేషన్ స్టేటస్ను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.

పథకం లక్షణాలు

  • అందజేయబడ్డ దరఖాస్తులను తహసీల్దారు మొదటి వెరిఫికేషన్ కోసం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కి పంపిస్తారు.
  • ఫీల్డ్ ఎంక్వయిరీ ని నిర్వహించడం విలేజ్ రెవెన్యూ అధికారుల యొక్క బాధ్యత.
  • విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లబ్ధిదారుల అర్హతను కింద ఇవ్వబడిన వివరాల ద్వారా చెక్ చేస్తారు :-
    • డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్.
    • లొకేషన్/ అడ్రస్.
    • తల్లిదండ్రుల ఆదాయం.
    • క్యాస్ట్ సర్టిఫికెట్.
    • అర్హత కలిగిన ఆదాయం వివరాలు.
    • బ్యాంకు ఖాతా నెంబర్, IFSC కోడ్.
    • ఆధార్ కార్డు వివరాలు.
    • లబ్ధిదారుల గత పెళ్లి వివరాలు. ఈ వివరాలు లోకల్ నివాసులు మరియు చుట్టుపక్కల వాళ్ల ద్వారా చెక్ చేయబడుతుంది.
  • ఈ వివరాలన్నీ వెరిఫై చేసిన తర్వాత, విలేజ్ దరఖాస్తును తమ వ్యాఖ్యలతో జతచేసి తాసిల్దార్ కు పంపిస్తారు.
  • అప్పుడు తహసిల్దారు తమరి మార్కుల ద్వారా దరఖాస్తును డిజిటల్ సైన్ మరియు బయోమెట్రిక్ ద్వారా అప్రూవ్ చేస్తారు.
  • తెలంగాణ కల్యాణ లక్ష్మి పథకం అప్లికేషన్ను సంబంధిత ఎమ్మెల్యే కూడా సైన్ చేస్తారు.
  • తర్వాత, సైన్ చేయబడిన దరఖాస్తు కాపీ ఆన్లైన్ సిస్టం లో చెక్కు క్లియరెన్స్ కోసం ఆన్లైన్ సిస్టంలో అప్లోడ్ చేస్తారు.
  • వివాహం కొరకు ఆర్థిక సహకారం అందజేసే చెక్కు, కేవలం లబ్ధిదారుల తల్లి పేరు మీదనే తీసుకోబడుతుంది.

ముఖ్యమైన లింక్స్

సంప్రదింపు వివరాలు

  • కళ్యాణ లక్ష్మి పథకం హెల్ప్ లైన్ నెంబర్ :- 040 23390228.
  • కల్యాణ లక్ష్మి పథకం హెల్ప్ డెస్క్ ఈమెయిల్ :- help.telanganaepass@cgg.gov.in.

Matching schemes for sector: Marriage

Sno CM Scheme Govt
1 తెలంగాణ షాదీ ముబారక్ పథకం తెలంగాణ

Comments

వ్యాఖ్య

కళ్యాణ లక్ష్మి నమోదు వివాహం జరిగిన ఎన్ని రోజుల వరకు చేసుకోవచ్చు?

వ్యాఖ్య

నేను అనాధను నేను కల్యాణలక్హ్మి మా అత్త గారి అడ్రస్ లో అప్లై చెయ్యాలా లేదా మా ఆర్ఫన్ హోమ్ అడ్రస్ లో చెయ్యాలా

స్థిరలంకె

వ్యాఖ్య

నా దరఖాస్తు ఆమోదించబడింది. కానీ ఇప్పటి వరకు నాకు కల్యాణలక్ష్మి పథం కింద ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు

Your Name
sigavarapu nagarani
వ్యాఖ్య

My name sigavarapu nagarani my marriage date 10-06-22 kalyana Lakshmi apply-ed and on line process completed but cheque not received and status showing amount sanctioned for this application deposited PD account of RDO showings please solve issue and arrange cheque

Marriage I'd no 2022KL221028746

With regards
G satish

స్థిరలంకె

Your Name
Dixit
వ్యాఖ్య

I've applied in the last year but still not any response but when I checked online it's showing the amount has been sanctioned from 8 months but no one is giving response

స్థిరలంకె

Your Name
Madhavareddy
వ్యాఖ్య

అబ్బాయి ఇన్కమ్ తో సంబంధం ఏముంది పెళ్లికి కళ్యాణ్ లక్ష్మి అని పెట్టినప్పుడు అమ్మాయికి వస్తుంది అమ్మాయికి వాళ్ళ అమ్మానాన్న ఇన్కమ్ తక్కువ ఉన్నట్లయితే మీరు కచ్చితంగా ఇవ్వాల్సిందే అలాంటిది అబ్బాయి ఇన్కమ్ తో జత చేస్తే ఎలా అమ్మాయి వాళ్ళు పేదవాళ్లు ఉంటారు అబ్బాయి ఎంతో కొంత ఉన్నవాళ్లు ఉంటారు అలా అని అమ్మాయికి ఇవ్వపోవడం చాలా బాధాకరమైన విషయం

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.